Header Banner

రాసుకోండి.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌తో ధోనీ ఈ రికార్డు బ్రేక్ చేయడం ఫిక్స్!

  Fri Apr 25, 2025 15:32        Sports

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజ ఆటగాడు ధోనీ తన సుదీర్ఘ టీ20 కెరీర్‌లో మరో కీలక ఘట్టానికి చేరువయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా సీజన్‌లో భాగంగా నేడు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తో జరగనున్న మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా ధోనీ తన 400వ టీ20 మ్యాచ్ ఆడనున్నాడు. ఈ అరుదైన మైలురాయిని అందుకోనున్న నాలుగో భారత క్రికెటర్‌గా నిలవనున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో టీ20 ఫార్మాట్‌లో 400 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో ధోనీ 24వ స్థానంలో చేరనున్నాడు. ఇప్పటికే భారత్ నుంచి రోహిత్ శర్మ (456 మ్యాచ్‌లు), దినేశ్ కార్తిక్ (412 మ్యాచ్‌లు), విరాట్ కోహ్లీ (408 మ్యాచ్‌లు) ఈ ఘనతను సాధించారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో 'పది' ప్రతిభావంతురాలికి ఎకరం పొలం! వారు సంతోషం వ్యక్తం..

 

ఇప్పుడు వారి సరసన ఎంఎస్ ధోనీ కూడా చేరబోతున్నాడు. టీమిండియాకు, సీఎస్‌కేకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ధోనీ, ఈ ఫార్మాట్‌లో తనదైన ముద్ర వేశాడు. ఈ మైలురాయితో పాటు, ధోనీ మరో ప్రత్యేకతను కూడా సొంతం చేసుకోబోతున్నాడు. 400 టీ20 మ్యాచ్‌లు ఆడిన రెండో భారత వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించబోతున్నాడు. ఇంతకుముందు దినేశ్ కార్తిక్ మాత్రమే వికెట్ కీపర్‌గా భారత్ నుంచి ఈ ఘనతను అందుకున్నారు. చెపాక్ స్టేడియంలో జరిగే నేటి మ్యాచ్‌లో ధోనీ బరిలోకి దిగితే, ఈ రికార్డులు అతడి ఖాతాలో చేరతాయి. సీఎస్‌కే అభిమానులు ఈ ప్రత్యేక సందర్భాన్ని వీక్షించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. జిల్లాలో క్లోవర్‌ లీఫ్‌! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సీఎంలకు హోం మంత్రి అమిత్ షా ఫొన్.. 48 గంటల లోపు.. ఎందుకంటే.!

 

మహిళలకు ప్రభుత్వం శుభవార్త.. 2-3 రోజుల్లో అకౌంట్లలోకి డబ్బులు.! వారికి ఇక పండగే పండగ..

 

సస్పెండ్ విషయంలో దువ్వాడ కీలక వ్యాఖ్యలు! తాను ఎప్పుడూ పార్టీకి..

 

మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు..! ఏం చేశారంటే..!

 

వైసీపీ గుట్టు రట్టు! సెక్షన్లకే షాక్ ఇస్తున్న సునీల్ కుమార్ కేసులు!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త పెన్షన్లకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!

 

విశాఖలో వైసీపీకి ఊహించని షాక్! ఒకవైపు అరెస్టుల కలకలం... మరోవైపు కీలక నేతలు పార్టీకి గుడ్‌బై!

 

ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్! రాబోయే మూడు రోజులు ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన కుండపోత వర్షం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia